WATER PROJECTS STORY : శంకుస్థాపనలతోనే సరి..!
ABN, Publish Date - Apr 27 , 2024 | 12:52 AM
మాటలు చెప్పడమేగాని.. చేతల్లో చూపించలేదు. ఇందుకు ఉదాహరణ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల శంకుస్థాపలు. శిలా ఫలకాలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామని ఊదరగొట్టారు. పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన గొప్పలు చెప్పారు. కానీ చేతల్లో చూపలేదు. శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా...
అటకెక్కిన మూడు రిజర్వాయర్ల నిర్మాణంభూ సేకరణ కూడా
చేయని వైసీపీ ప్రభుత్వం రాప్తాడు ప్రజలకు
మాట ఇచ్చి.. తప్పిన సీఎం జగన
సాగునీటి ప్రాజెక్టులను సీఎం జగన తీవ్ర నిర్లక్ష్యం
చేశారు. ఐదేళ్లలో కరువు జిల్లా ప్రాజెక్టుల గురించి
మాటలు చెప్పడమేగాని.. చేతల్లో చూపించలేదు. ఇందుకు ఉదాహరణ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల శంకుస్థాపలు. శిలా ఫలకాలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామని ఊదరగొట్టారు. పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన గొప్పలు చెప్పారు. కానీ చేతల్లో చూపలేదు. శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదు. భూసేకరణ పనులు కూడా మొదలు పెట్టలేదు. - రాప్తాడు
మూడు అన్నారు..
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించే క్రమంలో రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తామని జగన ప్రభుత్వం ప్రకటించింది. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద 0.89 టీఎంసీల నీటి సామర్థ్యంతో దేవరకొండ రిజర్వాయర్, ఆత్మకూరు మండలంలో తోపుదుర్తి వద్ద 1.05 టీఎంసీలతో ఒక రిజర్వాయర్, ముట్టాల వద్ద 1.06 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మిస్తామని అన్నారు. వీటికి రూ.803 కోట్లను వెచ్చిస్తామని అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం దేవరకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి 2020 డిసెంబరు 9వ తేదీన సీఎం జగన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఫైలాన ఆవిష్కరించారు. రిజర్వాయర్‌ను పూర్తిచేసి 75 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. జిల్లా ఇనచార్జి మంత్రి బొత్స సత్య నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన వర్చువల్ విధానంలో ఫైలాన ఆవిష్కరించి నాలుగేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు.
భూసేకరణ కూడా చేయలేదు...
రిజర్వాయర్లు నిర్మించాలంటే నీటి సామర్థ్యం బట్టి దేవరకొండ వద్ద దాదాపు 820 ఎకరాలు, తోపుదుర్తి వద్ద 1400 ఎకరాలు, ముట్టాల వద్ద 980 ఎకరాలు భూమి అవసరమని అధికారులు నిర్ధారించారు. భూ సేకరణ పనులు ప్రారంభించలేదు. ఎకరాకు ఇంత పరిహారం ఇస్తామని కూడా స్పష్టంగా తెలపలేదు. భూ సేకరణ వెంటనే చేపడతామని 2022 జూన 14న చెన్నేకొత్తపల్లిలో రైతు దినోత్సవ సభలో సీఎం జగన ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ భూ సేకరణ చేయలేదు. 2017 డిసెంబరు 13న రాప్తాడులో జగన నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో రూ. 4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పూర్తయినా ఆ హామీ అమలు కాలేదు.
మాటలే.. చేతల్లో లేదు..
రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లను నిర్మించి, పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత జగన హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి నాలుగేళ్లవుతోంది. ఇప్పటి వరకూ ఒక్క రిజర్వాయర్ నిర్మాణానికీ చర్యలు చేపట్టలేదు. ఒక్క ఇటుక కూడా వేయలేదు. భూ సేకరణ కూడా చేయలేదు. ఐదేళ్లుగా హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. రిజర్వాయర్ల నిర్మాణంలో సీఎం జగన, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి విఫలమయ్యారు.
- లింగన్న, రైతు సంఘం నాయకుడు
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 27 , 2024 | 12:52 AM