ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS JAGAN : నేడు తాడిపత్రికి జగన

ABN, Publish Date - Apr 28 , 2024 | 12:26 AM

ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం వైఎస్‌ జగన తాడిపత్రికి ఆదివారం వస్తున్నారు. పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పుట్లూరు రోడ్డులోని కర్నూలు వెంచర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వైఎస్సార్‌ సర్కిల్‌కు చేరుకుంటారు. 10:15 గంటలకు సభలో..

Police conducting a mock drill

భారీగా పోలీసు బందోబస్తు.. యథావిధిగా చెట్ల నరికివేత

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌ 27: ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం వైఎస్‌ జగన తాడిపత్రికి ఆదివారం వస్తున్నారు. పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పుట్లూరు రోడ్డులోని కర్నూలు వెంచర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వైఎస్సార్‌ సర్కిల్‌కు చేరుకుంటారు. 10:15 గంటలకు సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత తిరుపతి జిల్లా వెంకటగిరికి బయలుదేరుతారు. సీఎం పర్యటనకు ఎస్పీ బర్దర్‌ నేతృత్వంలో 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


అడిషనల్‌ ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు 10 మంది, సీఐలు 30 మంది, ఎస్‌ఐలు 50 మంది సీఎం భద్రతలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌ సర్కిల్‌లో పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులు, ప్రధాన రహదారుల్లో కవాతు నిర్వహించారు. రెండు రోజుల ముందు నుంచి పోలీసులు తాడిపత్రిని తమ అధీనంలోకి తీసుకున్నారు. పట్టణంలో ఎక్కడచూసినా పోలీసులే కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు సీఎం ప్రయాణించే మార్గంలోని పలు చెట్లను అధికారులు నరికించివేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కకడున్నా చెట్ల నరికివేత ఆనవాయితీగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఎందుకు నరికారో చెప్పండి

మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి టౌన: పట్టణంలోని పుట్లూరు రోడ్డులో చెట్లను ఎందుకు నరికేశారో చెప్పాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డిని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నిలదీశారు. తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం తాడిపత్రికి రావడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ చెట్లను ఎందుకు నరుకుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. చెట్లు ఏం పాపం చేశాయో తనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ‘ఎమ్మెల్యే అయిన తర్వాత రెండేళ్లు చెట్ల జోలికి పోకుండా బాగానే ఉన్నావు కదా?’ అని పరోక్షంగా చీనీ చెట్ల నరికివేత సంస్కృతి ప్రస్తావిస్తూ.. పెద్దారెడ్డిని ఎద్దేవా చేశారు. చెట్లను నరికే సంస్కృతిని ఎమ్మెల్యే ఇంకా మరిచిపోలేదని అర్థమవుతోందని అన్నారు.


తాము ఎంతో కష్టపడి చెట్లను పెంచితే.. వాటిని నరికి శునకానందం పొందుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదనం అంటే ఎమ్మెల్యేకు నచ్చదని విమర్శించారు. ఎన్నికల తర్వాత చెట్లకు బదులు మనుషులను నరుకుతారా? అని ప్రశ్నించారు. సీఎం జగన పచ్చదనం పట్ల ప్రేమ లేదని అన్నారు. మున్సిపల్‌ డీఈ దగ్గరుండి చెట్లను నరికివేయిస్తే ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. డీఈని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్‌ పచ్చదనం కోసం చేసిన ఖర్చు దేశంలో ఎవరూ పెట్టలేదని అన్నారు. ప్రధాని మోదీ, దేశంలోని పలు రాషా్ట్రల ముఖ్యమంత్రులు ఎక్కడ పర్యటించినా చెట్ల జోలికి వెళ్లరని, మన రాష్ట్రంలో మాత్రమే సీఎం వస్తున్నారంటే చెట్లను నరికేస్తున్నారని విమర్శించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:27 AM

Advertising
Advertising