ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP MEETING : కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం

ABN, Publish Date - May 02 , 2024 | 12:11 AM

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి.. మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరూక్‌ సిబ్లి.. ముస్లింలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. నూర్‌బాషాల సంఘం అభివృద్ధికి మేనిఫెస్టోలో....

Talking Sharif

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి

తాడిపత్రి టౌన, మే 1: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి.. మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరూక్‌ సిబ్లి.. ముస్లింలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. నూర్‌బాషాల సంఘం అభివృద్ధికి మేనిఫెస్టోలో రూ.వందకోట్లు కేటాయించడం చంద్రబాబుకు మైనార్టీ సోదరుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలపై


దౌర్జన్యాలు జరిగాయని, హత్యలు ఎక్కువగా జరిగాయని అన్నారు. పలువురు ముస్లిం సోదరులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ భద్రత లేదని అన్నారు. జగన బటన నొక్కుడుతో రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందని వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపే మైనార్టీల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎలాంటి అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన మహమ్మద్‌ షరీఫ్‌, టీడీపీ కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి అశ్మిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమి లేదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్‌ షరీఫ్‌ అన్నారు. మైనార్టీల ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో మైనార్టీలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని అన్నారు. ఆడపిల్లలకు వైసీపీ పాలనలో రక్షణ కరువైందని అన్నారు.


- బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ అన్నారు. అందరి అభివృద్ధే కూటమి ప్రధాన ఉద్దేశమని అన్నారు. వైసీపీ అబద్ధాలను ఎవరూ నమ్మవద్దని కోరారు.

- ముస్లిం సోదరులకు జేసీ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రంజాన తోఫాతోపాటు నిలిచిపోయిన పథకాలను అన్నింటిని పునరుద్ధరిస్తామని అన్నారు.

- జేసీ సోదరులకు మైనార్టీలు అంటే ఎంతో ప్రేమ అని టీడీపీ నేత జేసీ పవనరెడ్డి అన్నారు. బీడీ కార్మికుల కోసం స్థలాలు, రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఆటోనగర్‌ నిర్మాణం చేపట్టిన ఘనత జేసీ బ్రదర్స్‌కు దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో దేశంలోనే తాడిపత్రి పేరు వినిపించిందని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడిపత్రి భ్రష్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జిలానబాషా, నాయకులు హాజీ బాషా, విరాజ్‌రెడ్డి, సాలార్‌బాషా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:11 AM

Advertising
Advertising