JC: ఈ-పంట నమోదులో పొరబాట్లకు తావులేదు
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:04 AM
ఈ-పంట నమోదులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ హెచ్చరించారు. మండలంలోని కల్లుమడి, దనపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ-పంట నమోదు సూపర్ చెక్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
శింగనమల, అక్టోబరు 4: ఈ-పంట నమోదులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ హెచ్చరించారు. మండలంలోని కల్లుమడి, దనపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ-పంట నమోదు సూపర్ చెక్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో రైతుల పొలాల్లోకి వెళ్లి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంట వివరాలు తప్పులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ బ్రహ్మయ్య, వ్యసాయశాఖ డీఈ వెంకటరాముడు, ఏఓ అన్వే్‌షకూమార్, హర్టికల్చర్ అధికారి శైలజ పాల్గొన్నారు.
సచివాలయాన్ని పరిశుభ్రంగా ఉంచకపోతే ఎలా?: గ్రామ సచివాలయాన్ని పరిశుభ్రంగా ఉంచకపోతే ఎలా అని సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ శివనారయణ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో మురుగుదోడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, చుట్టూ అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు. స్వచ్ఛతాహీ సేవ అంటే ఇదేనా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. కా ర్యాలయమే ఇలా ఉంటే గ్రామంలో పరిశుభ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తహసీల్దార్ బ్రహ్మయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.