MLA SHRAVANISHREE: గురుకులంలో మౌలిక వసతులు కల్పించండి
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:15 AM
ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాల ల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని ప్రోగ్రె సివ్ స్టూడెంట్ ఫెడరేషన ఆఫ్ ఇండియా (పీఎస్‌ఎఫ్ ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దు ల్ ఆలం డిమాండ్ చేశారు. పీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ ఆలం, జిల్లా అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ప్రతిభా భారతి, ఉపాధ్యక్షురాలు మౌనిక శుక్రవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని అనంతపురంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఎమ్మెల్యే శ్రావణిశ్రీకి పీఎస్‌ఎఫ్‌ఐ నాయకుల వినతి
గార్లదిన్నె, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాల ల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని ప్రోగ్రె సివ్ స్టూడెంట్ ఫెడరేషన ఆఫ్ ఇండియా (పీఎస్‌ఎఫ్ ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దు ల్ ఆలం డిమాండ్ చేశారు. పీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ ఆలం, జిల్లా అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ప్రతిభా భారతి, ఉపాధ్యక్షురాలు మౌనిక శుక్రవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని అనంతపురంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గార్లదిన్నెలో నిర్వహిస్తున్న ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురు కుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాలలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. అయితే కేవలం 12 గదులు మాత్ర మే ఉన్నాయన్నారు. గదుల కొరతతో పాటు మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పగలు తరగతి గదులుగా, రాత్రి పడక గదులుగా వినియోగిం చుకుంటున్నారని అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.... సంబంధిత అధికారులతో చర్చించి మైనార్టీ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృష చేస్తామని తెలిపారు.
సీఎం ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
శింగనమల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని అరుగురు బాధితుల కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశా రు. ఆమె శుక్రవారం అనంతపురం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం చెందిన అరుగురికి రూ.6, 34, 089 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తీవ్ర అనారోగ్యం, ప్రమాదంలో గాయపడిన నియోజకవ ర్గంలోని ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చులు అందజేస్తామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....