Share News

BANDARU SRAVANI : నాణ్యమైన విద్య.. భోజనం అందాలి

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:40 PM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చూడాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో ఆగిపోయిన మధ్యాహ్న ...

BANDARU SRAVANI : నాణ్యమైన విద్య.. భోజనం అందాలి
MLA lunch with students

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం, జూన 28: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చూడాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో ఆగిపోయిన మధ్యాహ్న భోజనం పథకం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్‌తో మాట్లాడి నిధులు


మంజూరు చేయిస్తామని అన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని తెలుసుకుని, మెగా డీఎస్సీ ద్వారా త్వరలోనే ఆ సమస్య పరిష్కారమౌతుందని అన్నారు. ఇతర సమస్యలను డీఈఓతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ఈ ఏడాది ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. ఎంఈఓ లింగానాయక్‌, హెచఎం వసుంధర, టీడీపీ జిల్లా ఉపాధ్యాక్షుడు పసుపుల హనుమంతరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 11:40 PM