AP News: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి ఘటన వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్
ABN, Publish Date - Feb 19 , 2024 | 04:20 PM
రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై (Andhra Jyothy Photographer Srikrishna) దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ (SP Anburajan) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వదలలేదని.. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసినట్లు తెలిపారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.
అనంతపురం, ఫిబ్రవరి 19: రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై (Andhra Jyothy Photographer Srikrishna) దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ (SP Anburajan) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వదలలేదని.. ఇప్పటికే వారందరినీ ఐడెంటిఫై చేసినట్లు తెలిపారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేసినట్లు చెప్పారు. పత్రికా విలేకరుల రక్షణ తమ బాధ్యత అని అన్నారు. వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తామన్నారు. ‘‘మీపై దాడులు చేసినా బెదిరింపులు చేసినా మాకు ఫిర్యాదు చేయండి’’ అంటూ జర్నలిస్టులకు ఎస్పీ అన్బురాజన్ సూచించారు.
ఇవి కూడా చదవండి
AP News: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి ఘటనపై నందమూరి బాలకృష్ణ స్పందన.. ఏమన్నారంటే..
CEC: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ సీరియస్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2024 | 06:07 PM