ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JC: ఎక్కడా తలవంచేది లేదు.. జేసీ సంచలన ప్రెస్‌మీట్

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:36 AM

Andhrapradesh: ‘‘ ఫ్లై యాష్ అనేది నా పుట్టగోస లాంటిది.. అది కేవలం మా ప్రెస్టేజ్ మాత్రమే. మా గురించి మాట్లాడే వాళ్ళకే కాదు.. మాకు కూడా చీము నెత్తురు ఎక్కువ ఉంది’’ అని జేసీ అన్నారు. అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎవరికి ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదని..

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy

అనంతపురం, డిసెంబర్ 27: ప్రభుత్వ పెద్దలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. డబ్బుల కోసం పార్టీలలో చేరారంటూ కొందరు మాట్లాడుతున్నారని.. అసలు తమ గురించి ఏమనుకుంటున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లై యాష్ వివాదం పై అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి క్షమాపణలు చెప్పారు. ‘‘1951లోనే మద్రాసులో మమ్మల్ని చదివించారు... మేము డబ్బులు లేనోళ్లం.. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాం ఇది మా బ్యాక్ గ్రౌండ్’’ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమ గురించి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘అత్యంత ఖరీదైన కార్లలో మేము ఎప్పుడో తిరిగాం. మేం లేనివాళ్లం అంటూ కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. నా పొగరు వల్ల గత ఐదు సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయాం. డబ్బుల కోసం ఫ్లై యాష్ అంటూ విమర్శిస్తారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఫ్లై యాష్ అనేది నా పుట్టగోస లాంటిది.. అది కేవలం మా ప్రెస్టేజ్ మాత్రమే. మా గురించి మాట్లాడే వాళ్ళకే కాదు.. మాకు కూడా చీము నెత్తురు ఎక్కువ ఉంది’’ అని అన్నారు.


అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎవరికి ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదని.. చేతకాకపోతే కుటుంబం కోసం క్లీనర్ పని చేసైనా బతుకుతామన్నారు. డీజీపీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులకు న్యాయం చేయమని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘చాలా బాధాకరం.. ఫ్లై యాష్ కోసం పరిశ్రమ వద్ద ఉన్న నా లారీల అద్దాలను పగలగొట్టారు. నాపై ఉన్న కేసుల గురించి కుటుంబ సభ్యులు మానసికంగా క్షోభకు గురవుతున్నారు... మా అన్న మానసికంగా బాధపడి అనారోగ్యానికి గురయ్యారు’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

అమరావతిలో అండర్‌గ్రౌండ్‌ దందా


ఏం జరిగినా ఆయన వెంటనే నడిచా...

‘‘ జరుగుతున్న వాటిపై నా భార్య, పిల్లలు జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి నలిగిపోయారు. నాకు ఉన్న బస్సులు తిప్పుకున్న చాలు... ఫ్లై యాష్ గురించి మాట్లాడతారా అది నా ప్రెస్టేజ్ మాత్రమే. పార్టీ అధ్యక్షుడి నుంచి మంత్రుల వరకు అందరికీ లేఖ రాసినా ఎవరూ పట్టించుకోరు. నాకు డబ్బులు కాదు మర్యాద కావాలి.. నేను ఎవరికి భయపడను. వైసీపీ ప్రభుత్వంలో నన్ను జైల్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీకు మాత్రమే కుటుంబాలు ఉండేది.. మాకు కుటుంబాలు లేవా... మా వదిన నన్ను పట్టుకుని కన్నీళ్లు పెడుతోంది. కొంతమందికి డబ్బులు ఉండొచ్చు.. డబ్బులతో మమ్మల్ని లొంగపరచుకోలేరు. చాలా మంది మా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజారెడ్డి వల్ల ఆ కుటుంబంతో సాన్నిహిత్యం చెడింది. గత ప్రభుత్వ హయాం వైసీపీ నుంచి ఒత్తిడీ వచ్చినా వెళ్లలేదు... వ్తెసీపీకి లొంగకపోవడం వల్లే ఈడీ, బస్సులు సీజ్ చేశారు. వ్తెసీపీ హయాంలో పొగరు, ఫ్రిస్టేజ్‌తో లేకుంటే ఏ సమస్య ఉండేది కాదు. ఏం జరిగినా మా నాయకుడు చంద్రబాబు నాయుడును నమ్ముకుని ఆయన వెంట నడిచాను’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇదీ విషయం..

కాగా.. తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నట్లు పరిస్థితులు మారాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్‌ రవాణా చేసే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది. తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ చెబుతున్నారు. కానీ, తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్‌ను జేసీ వర్గీయులు తరలిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోవటం వివాదానికి దారి తీసింది.


ఆర్టీపీపీ తమ నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి ఫ్లైయాష్‌ను తమ వాహనాల్లో తరలిస్తామని ఆదినారాయణ మద్దతుదారులు.. కాదు తమ నియోజకవర్గానికి తరలిస్తున్నారు కాబట్టి తమ వాహనాల్లోనే ఫ్లైయాష్‌ను తరలిస్తామని జేసీ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరువురు కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా కావడంతో అదికాస్త ప్రభుత్వంలోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వివాదం కాస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చేరుకోకా ఇరువురిని పిలిచి సమస్యను పరిష్కరించాలని సీఎం భావించారు. ఇద్దరు తనను కలవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. సీఎంను కలిసి ఫ్లై యాష్ వివాదంపై వివరణ ఇచ్చినప్పటికీ.. జేసీ ప్రభాకర్ మాత్రం హాజరుకాలేదు. దీంతో సీఎం పిలిచినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరుకాకపోవడంపైనా పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి...

Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం

గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 03:52 PM