GUMMANURU: రానున్నది టీడీపీ ప్రభుత్వమే
ABN , Publish Date - May 12 , 2024 | 12:04 AM
ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమని, అది తెలిసే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ముమ్మరమయ్యాయని ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.
గుమ్మనూరు నారాయణ స్వామి
గుంతకల్లు, మే 11: ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమని, అది తెలిసే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ముమ్మరమయ్యాయని ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు. మండలంలోని గుర్రబ్బాడు గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారిని పసుపు కండువాలతో శనివారం పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 30 మంది వైసీపీ నాయకులకు టీడీపీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారిలో 18వ వార్డుకు చెందిన రాజు, భాస్కర్, మోహన, ద్వారక, శివ, వీరేశ, ప్రభాకర్, గుర్రబ్బాడుకు చెందిన మధుసూదన, నాగార్జున, నాగేంద్ర, కొడారెడ్డి, హనుమేశ, అశ్వత్థరెడ్డి, మస్తాన రెడ్డి, నరసింహులు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్ పాల్గొన్నారు. గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పట్టణంలోని 10, 26, 27 వార్డుల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.