MS Raju : నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:24 AM
: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను ...
గోరంట్ల మాధవ్‌కు ఎంఎస్ రాజు వార్నింగ్
అనంతపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను విమర్శిస్తున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ లాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో కొనసాగిస్తున్న జగనను ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. మహిళలను వేధించినవారిని జగన తన పార్టీలోనే కొనసాగిస్తారని అన్నారు. గంట, అరగంట అనే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివా్‌సపైనా ఎలాంటి చర్యలు
తీసుకోలేదని విమర్శించారు. హోంమంత్రి అనిత బాలకృష్ణకు పాదాభివందనం చేయడాన్ని హేళన చేస్తున్న మాధవ్‌కు సంస్కారం లేదని అన్నారు. బాలకృష్ణ తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు కుమారుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన చంద్రబాబు, బాలకృష్ణ తమకు దేవుళ్లతో సమానమని అన్నారు. వారి ఆశీస్సులతోనే అనిత హోంమంత్రి అయ్యారని, తనలాంటి నిరుపేద దళితుడు ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. అలాంటివారికి పాదాభివందనం చేస్తే మాధవ్‌కు వచ్చిన నొప్పేమిటని ప్రశ్నించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని, నోటికొచ్చినట్లు మాట్లాడితే చేతలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకో మాధవ్
ఎమ్మెల్యే బండారు శ్రావణి
శింగనమల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మచ్చ లేని నాయకులు చంద్రబాబు, పవన కల్యాణ్, బాలకృష్ణను విమర్శించే అర్హత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు లేదని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. గోర్లంట మాధవ్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎన్నికలలో వైసీపీ గాలికి కొట్టుకుపోయిందని, అందుకే మాధవ్‌కు పిచ్చిపట్టి గాలిమాటలు మట్లాడుతున్నారని అన్నారు. ఎంపీగా ఆయన చేసిన నీతిమాలిన పనికి ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఐదేళ్లపాటు పురం ఎంపీగా ఉండి చేసిన అభివృద్ధి ఏమిటని ఆమె ప్రశ్నించారు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారిని కూటమి ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తోందని, కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలను ఎలా కాపాడుకోవాలో తమ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 23 , 2024 | 12:24 AM