ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లక్ష ఎకరాలకు సాగునీరు ఏమైంది..?

ABN, Publish Date - Apr 21 , 2024 | 12:26 AM

‘అధికారంలోకి వస్తే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చావ్‌ గుర్తుందా ప్రకాష్‌రెడ్డి... ఐదేళ్లు అయింది... ఒక్క సెంటుకు కూడా నీరు ఇవ్వలేదు.. కనీసం ఒక్క చెరువుకు కూడా నీరివ్వలేదు... ఇక నీ మాటలను ప్రజలు నమ్మె స్థితిలో లేరు.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు.

TDP PARITALA PRACHARAM

రాప్తాడు, ఏప్రిల్‌ 20: ‘అధికారంలోకి వస్తే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చావ్‌ గుర్తుందా ప్రకాష్‌రెడ్డి... ఐదేళ్లు అయింది... ఒక్క సెంటుకు కూడా నీరు ఇవ్వలేదు.. కనీసం ఒక్క చెరువుకు కూడా నీరివ్వలేదు... ఇక నీ మాటలను ప్రజలు నమ్మె స్థితిలో లేరు.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని గాండ్లపర్తి, వరిమడుగు, బండమీదపల్లి, మరూరు గ్రామాల్లో ఆమె పర్యటించిన ఆమె మాట్లాడారు.


ఎన్నికల ముందు బనీన్లు బక్కలు పడ్డాయని చెప్పి... అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధి చేయకుండా జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. ఎంతో ఆర్భాటంగా ఇచ్చిన లక్ష ఎకరాలకు నీరిస్తానని హామీ ఇచ్చా... కనీసం గొర్రెలకు తాగేందుకు కూడా నీళ్లు లేకుండా చేశావని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ. 8 కోట్లు ఖర్చు పెట్టి కాలువ తవ్వి బండమీదపల్లి చెరువుకు నీరిచ్చామ న్నారు. సీసీరోడ్డు, అంగనవాడీలు, వసతి గృహం, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులు చేశామన్నారు. అభివృద్ధిలో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన వారిపైనే దాడులు చేయించి వారిపైనే కేసులు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు, ప్రతి చెరువుకు నీరందిస్తామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...


మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 12:26 AM

Advertising
Advertising