Tadipatri: ఏబీఎన్ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
ABN, Publish Date - Aug 21 , 2024 | 10:14 AM
Andhrapradesh: తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారలేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని వైసీపీ నేత కందిగోపుల మురళి హల్‌చల్ చేశాడు. ఏబీఎన్ రిపోర్టర్ రమణను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగాడు సదరు వైసీపీ నేత. కందిగోపుల మురళి బెదిరింపులపై ఎస్పీ జగదీష్‌కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.
అనంతపురం, ఆగస్టు 21: ఏపీలో (Andhrapradesh) అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ (YSRCP) ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా తమదే అధికారం అన్న ధోరణిలో కొందరు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న పరిస్థితి. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలకు అంతే లేదు. రాష్ట్రంలో వైపీపీ నేతల రౌడీయిజం కూడా ఎక్కువే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు వాళ్ల పని అయిపోనట్లే అన్నట్లుగా వ్యవహరించేది గత వైసీపీ సర్కార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వైసీపీ పాపాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అన్ని వ్యవస్థలను కూడా వైసీపీ భ్రష్టు పట్టించిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. ప్రస్తుతం వ్యవస్థలను గాడిలో పెట్టే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu).
AP News: శ్రీశైలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
ఇదిలా ఉండగా... తాడిపత్రిలో వైసీపీ నేతల తీరు మారలేదు. పట్టపగలే తుపాకులు పట్టుకుని వైసీపీ నేత కందిగోపుల మురళి హల్‌చల్ చేశాడు. ఏబీఎన్ రిపోర్టర్ రమణను అసభ్య పదజాలంతో దూషిస్తూ కాల్చివేస్తానంటూ బెదిరింపులకు దిగాడు సదరు వైసీపీ నేత. కందిగోపుల మురళి బెదిరింపులపై ఎస్పీ జగదీష్‌కు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.
అయితే జర్నలిస్టు ఫిర్యాదులను తాడిపత్రి పట్టణ పోలీసులు పట్టించుకోని పరిస్థితి. తిరిగి ఫిర్యాదు చేసిన ఏబీఎన్ రిపోర్టర్‌పై ఫిర్యాదు నమోదు అయ్యింది. వైసీపీ నేత కందిగోపుల మురళి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 351(2),79 బీఎన్‌ఎస్.. క్రైం నెంబర్ 154/2024 సెక్షన్ల కింద ఏబీఎన్ రిపోర్టర్ రమణపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాడిపత్రి పోలీసుల వ్యవహార తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
Amaravarti : లోకేశ్ ఫ్లెక్సీ పెట్టామని హోటల్ మూయించారు
Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 21 , 2024 | 10:23 AM