ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP : యానిమేటర్లతో వైసీపీ సమావేశం

ABN, Publish Date - May 10 , 2024 | 12:20 AM

ఎన్నికలలో మహిళలను ప్రలోభ పెట్టేందకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రధాన అనుచరుడు పాల్గొనడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అక్కడి ...

Keshav is complaining

తెలిసినా పట్టించుకోని అధికారులు

ఉరవకొండ మే 9: ఎన్నికలలో మహిళలను ప్రలోభ పెట్టేందకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రధాన అనుచరుడు పాల్గొనడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అక్కడి నుంచి జారుకున్నాడు. యానిమేటర్లు అధికారుల కళ్లెదుటే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయినా వారిని అధికారులు విచారించకపోవడం


అనుమానాలకు తావిస్తోంది. వైకేపీ అధికారుల సహకారంతోనే యానిమేటర్ల సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఉరవకొండలో యానిమేటర్లతో వైసీపీ నాయకులు సమావేశాలు నిర్వహించినా వైకేపీ అధికారులు పట్టించుకోలేదు.

తొత్తులుగా మారారు: మండిపడ్డ కేశవ్‌

అధికారపార్టీ నాయకులకు వైకేపీ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ కేతనగార్గ్‌ను కలిసి యానిమేటర్ల సమావేశంపై ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీపీ చంద్రమ్మ ఈ నెల 7న పట్టణానికి చెందిన యానిమేటర్లతో తన ఇంట్లో సమావేశం నిర్వహించారని, ఈ సమావేశంలో విశ్వ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని ఆయన అన్నారు. డ్వాక్రా సభ్యులతో ఓటు వేయిస్తే ముక్కు పుడకలు పంపిణీ చేస్తామని ప్రలోభపెట్టారని అన్నారు. సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, అక్కడికి ఆలస్యంగా చేరుకున్నారని అన్నారు.


ఎంసీసీ కానిస్టేబుల్‌ వచ్చిన బైక్‌లోనే మాజీ ఎమెల్యే వ్యక్తిగత పీఏ పారిపోతున్న విజివల్స్‌ ఉన్నాయని అన్నారు. డ్వాక్రా సభ్యులు కూడా హడావుడిగా పరుగులు పెట్టారని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, ఏపీఎం శివయ్య పాత్ర ఉందని ఆరోపించారు. ఎవరి కోసమో పని చేసి జీవితాలను బలిచేసుకోవద్దని ఆయన యానిమేటర్లను కోరారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాటలు వింటే శాశ్వతంగా క్రిమినల్‌ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన మాటలు విన్న అధికారులు కూడా సస్పెండ్‌ అయ్యారని గుర్తు చేశారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 10 , 2024 | 12:20 AM

Advertising
Advertising