ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన డీసీఎం పవన్..

ABN, Publish Date - Jul 28 , 2024 | 12:05 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి(CM Chandrababu) ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి పవన్ సీఎంకు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు? ఈ కథనంలో తెలుసుకుందాం.

CM Chandrababu Naidu and DCM Pawan Kalyan

అమరావతి, జులై 28: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి(CM Chandrababu) ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరి పవన్ సీఎంకు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు? ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు.


ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పవన్.. ‘రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయ. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరునే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి.. విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ప్రముఖుల పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామం. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం.’ అని పేర్కొన్నారు.


‘మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి.’ అని పవన్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.


‘మన దేశపు మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి.’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


Also Read:

టీడీపీ కార్యకర్త హత్య..

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. హాట్ కామెంట్స్..

వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 28 , 2024 | 12:39 PM

Advertising
Advertising
<