ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: వాళ్లందరి పింఛన్లు కట్.. నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Dec 18 , 2024 | 08:04 AM

పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ల పెన్షన్లను కట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు వారికి నోటీసుల జారీకి సిద్ధమైంది.

AP News

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రీసెంట్‌గా రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేశారు. అయితే కొన్ని జిల్లాల్లో అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. అర్హత లేకపోయినా పించన్లు తీసుకుంటున్నట్లు తేలింది. దీంతో అలాంటి వారి పింఛన్లు కట్ చేయాలని ఏపీ సర్కారు డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ముందుగా వారికి నోటీసులు జారీ చేస్తోంది.


వాళ్లు సేఫ్!

అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తోంది ఏపీ గవర్నమెంట్. నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుంటారు అధికారులు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే పింఛన్ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ల పెన్షన్ రద్దు చేస్తారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు సెర్ప్ సీఈవో వీరపాండ్యన్. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు సర్కారు నుంచి సూచనలు వెళ్లాయి.


వివరణ ఇవ్వాల్సిందే..

ఏపీ వ్యాప్తంగా అనర్హులందరికీ నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి నోటీసులు అందనున్నాయి. పెన్షన్ పొందేందుకు ఏం అర్హత ఉందో చెబుతూ లబ్ధిదారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అర్హతను నిరూపించుకోకపోతే వాళ్ల పింఛన్ కట్ అవుతుంది. నిర్దేశించిన గడువు లోపు వివరణ ఇవ్వకపోతే వాళ్ల పింఛన్‌ను హోల్డ్‌లో పెడతారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద సెర్ప్ ఆధ్వర్యంలో రీసెంట్‌గా గవర్నమెంట్ జిల్లాకో సచివాలయ పరిధిలో తనిఖీలు నిర్వహించింది. ఇందులో 563 మంది అనర్హుల్ని గుర్తించింది. వాళ్లందరికీ నోటీసులు జారీ చేయనున్నారు. వీళ్లంతా ఇచ్చే వివరణ తర్వాతే డెసిషన్ తీసుకుంటారు.


Also Read:

సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?

గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు

కరువు భత్యం కోసం న్యాయపోరాటం

For More AP And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 08:08 AM