Employees: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది జీతం విడుదల..
ABN, Publish Date - Sep 14 , 2024 | 10:54 AM
ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 14: ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దాంతోపాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ ఉన్నత విద్యా వ్యవవస్థను నిర్వీర్యం చేశారని లోకేష్ విమర్శించారు. ప్రస్తుతం తాము ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఇదే విషయమై ఒక ప్రకటన విడుదల చేసిన మంత్రి లోకేష్.. ‘గత 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.’ అని పేర్కొన్నారు.
Also Read:
ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..
జెత్వానీ కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరిపై వేటు..
లోకేష్‌కు తెలుగు యాత్రికుల ధన్యవాదాలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 14 , 2024 | 10:54 AM