AB Venkateswara Rao: హైకోర్టు తీర్పుతో దిగొచ్చిన జగన్ సర్కార్
ABN, Publish Date - May 31 , 2024 | 10:17 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దానిని జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టింది. ఏబీవీని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి పని దినం రోజున కొలువు ఇచ్చి తన పైశాచిక ఆనందాన్ని చాటుకుంది.
ఏం జరిగిందంటే..?
నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావును వేధింపులకు గురి చేసింది. సీఎంగా జగన్ ప్రమాం చేసిన మరుసటి రోజు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. 2014-2019లో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారనే ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన అంశంపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు చెప్పినా వినిపించుకోలేదని అభియోగాలు మోపారు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చేరవేశారని కేసు నమోదు చేశారు. ఆ కారణాలతో ఏబీవీని విధుల నుంచి తప్పించారు.
న్యాయ పోరాటం
ప్రభుత్వం తనను సప్పెండ్ చేయడంపై ఏబీవీ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు. క్యాట్ తర్వాత కేంద్ర హోం శాఖలో ఊరట దక్కలేదు. తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022 జూన్ 15న రిలీఫ్ కలిగంది. కోర్టు జోక్యంతో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఏబీవీ బాధ్యతలు చేపట్టారు. 14 రోజుల తర్వాత జూన్ 29వ తేదీన మళ్లీ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత న్యాయ పోరాటం చేశారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించారు. ఒకే కారణంతో రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సస్పెన్షన్ చెల్లదని, సస్పెన్షన్ ఎత్తివేస్తూ బాధ్యతలు అప్పగించాలని, వేతన బకాయిలు చెల్లించాలని క్యాట్ ఆదేశించింది. దీంతో జగన్ సర్కార్ దిగొచ్చింది. ఏబీవీకి పోస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Updated Date - May 31 , 2024 | 10:46 AM