ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: షర్మిలపై జగన్‌కు ఎందుకంత ‘పగ’.. అంటే..

ABN, Publish Date - Oct 25 , 2024 | 08:20 AM

Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

YS Jagan vs YS Sharmila

Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే సమయంలో జగన్ తీరుపై ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతోంది. సొంత చెల్లెలి విషయంలోనే ఇలా ఉన్న జగన్.. రాష్ట్ర ప్రజలను ఏం చూస్తాడనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా.. షర్మిల విషయంలో జగన్ ఇలా ప్రవర్తించడానికి ఓ కారణముందట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు. మరి అదేంటో మీరే చూసేయండి..


ఎందుకంత ‘పగ’... అంటే..

‘జన్మతః మన మధ్య సంక్రమించిన బాంధవ్యం, చిన్నతనం నుంచీ పంచుకున్న అనుభూతులు, ప్రశాంతమైన జ్ఞాపకాలన్నీ.. మారిన నీ వైఖరితో గతంగా మారాయి. సోదరుడినన్న ప్రేమ, ఆప్యాయతలు లేకుండా నువ్వు చేస్తున్న చర్యలతో నా హృదయం తీవ్రంగా గాయపడింది. నాపై పదేపదే అసత్యాలు చెప్పావు. తప్పుడు ప్రచారం చేశావు. రాజకీయంగా నాతో విభేదించడమే కాకుండా వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించావు. ఇంత చేశాక నీ మీద ప్రేమ, ఆప్యాయతలు ఎందుకు ఉండాలి. మన మధ్య సఖ్యత, సుహృద్భావ పరిస్థితులు లేవన్న దాంట్లో రహస్యమేమీ లేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో... ఆస్తుల్లో వాటాలకు సంబంధించిన ఒరిజినల్‌ ఎంవోయూ అమలు చేసేందుకు సిద్ధంగా లేను. సరస్వతీ పవర్‌లో వాటాలను ఇస్తూ చేసిన డిక్లరేషన్‌ను రద్దు చేసుకుంటున్నాను. న్యాయస్థానంలో కేసులు తేలాక, నీ వైఖరి మారితే... అప్పుడు అన్నా చెల్లెళ్ల బంధం మళ్లీ చిగురించే అవకాశం ఉంది!’’


కుటుంబ కలహాలు మామూలే..!

తల్లీ చెల్లితో ఆస్తి వివాదాలను ‘సాధారణమైన అంశం’గా వైఎస్‌ జగన్‌ తేల్చేశారు. వారిద్దరిపై ట్రైబ్యునల్‌లో కేసు వేయడాన్ని కూడా ‘మామూలు విషయం’గానే లెక్కకట్టారు. తాను డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నానని.. జనం దృష్టిని మళ్లించేందుకే ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ చేస్తున్నారని ఆరోపించారు. మీడియాలో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వార్తలు రాయిస్తున్నారని ఆక్రోశించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గురువారం విజయనగరం జిల్లాలో డయేరియా ప్రభావిత గ్రామమైన గుర్లలో పర్యటించారు. బాధితులను పరామర్శించిన అనంతరం ‘‘రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాటర్‌ ట్యాంకులు సకాలంలో శుభ్రం చేయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. డయేరియా ఘటన నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు అనుకూల పత్రికలు, మీడియాలో నాకు, నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాను తెరపైకి తెచ్చారు. కుటుంబ కలహాలు ఏ ఇంట్లో ఉండవు? అవి మామూలే’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.


Also Read:

ఆస్తులపైనే మీ ప్రేమ.. జగన్‌కు ఇచ్చిపడేసిన షర్మిల..

శారదా పీఠానికి మరో షాక్‌..

ఈ రాశి వారికి వివాహ నిర్ణయాలకు అనుకూలం !

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 12:11 PM