ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: పార్టీల వారీగా సభ్యుల లెక్కల్లో స్పీకర్ తడబాటు.. శాసనసభ నిరవధిక వాయిదా

ABN, First Publish Date - 2024-02-08T15:15:38+05:30

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. అయితే అసెంబ్లీలో పార్టీల వారీగా సభ్యుల లెక్కలు చెప్పేటప్పుడు స్పీకర్ తడబాటుకు గురయ్యారు.

అమరావతి, ఫిబ్రవరి 8: ఏపీ అసెంబ్లీ (AP Assembly Session) నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Seetharam) ప్రకటించారు. అయితే అసెంబ్లీలో పార్టీల వారీగా సభ్యుల లెక్కలు చెప్పేటప్పుడు స్పీకర్ తడబాటుకు గురయ్యారు. సభలో తనకు ఎదురైన అనుభవాలు చెపుతూ సభ్యుల సంఖ్యను సభాపతి తప్పుగా పలికారు. వైసీపీ సభ్యులు 151గా ప్రకటిస్తూ టీడీపీ సభ్యులను 2గా పేర్కొన్నారు. జనాసేన 1, ఖాళీలు 1 గా పేర్కొని మొత్తం 175 అంటూ స్పీకర్ లెక్క చెప్పారు. స్పీకర్ చెప్పిన ఈ లెక్కల ప్రకారం ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 155గా ఉంది.

కాగా.. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ సంద‌ర్భంగా చర్చల వివరాలను స్పీకర్ వెల్లడించారు. ఈ సెష‌న్‌లో మొత్తం మూడు రోజుల పాటు అసెంబ్లీ పనిచేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో స‌భ్యులు మొత్తంగా మాట్లాడిన స‌మ‌యం 10 గంట‌ల 2 నిముషాలు అని... స‌భ‌లో మాట్లాడిన స‌భ్యుల సంఖ్య 20 అని చెప్పారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం తొమ్మిది బిల్లులను పాస్ అయ్యాయని స్పీకర్ వెల్లడించారు.


జవాబుదారీగా వ్యవహరించా..: స్పీకర్

ఉత్తరాంధ్ర నుంచి శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్‌గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. సభ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చానని.. సభకు జవాబుదారీగా వ్యవహరించినట్లు చెప్పారు. స‌భాప‌తిగా ఉన్న స‌మ‌యంలో అనేక కీల‌క బిల్లులు ఆమోదం పొందాయన్నారు. విప‌క్ష స‌భ్యుల అనుచిత ప్రవర్తనకు బాధితునిగా మారానన్నారు. ప్రతిపక్ష సభ్యులు విమర్శలను ఓపికగా భరించినట్లు చెప్పారు. విప‌క్ష స‌భ్యులు ప్రవర్తన తనను బాధించిందన్నారు. విధులు నిర్వర్తించడంలో తనను ఇబ్బందిపెట్టారన్నారు. విప‌క్షాలు త‌మ ప్రవర్తనతో శాస‌న‌స‌భ స్ధాయిని త‌గ్గించారన్నారు. స‌భ గౌర‌వ మ‌ర్యాద‌లు కాపాడేలా ప్రతీఒక్కరూ ప్రవర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - 2024-02-08T15:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising