CM Chandrababu: చంద్రబాబు స్వీట్ వార్నింగ్.. ఎవరికో..?
ABN, Publish Date - Jul 07 , 2024 | 03:43 PM
సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో ఏపీతో తరచూ వివాదాలు పెట్టుకోవద్దని ఓ రకంగా తెలంగాణ సీఎంకు సూచించారని కొందరు విశ్లేషిస్తుండగా.. తెలంగాణతో గొడవలు లేకుండా సామరస్యపూర్వక ధోరణితో ముందుకెళ్తే ఎటువంటి వివాదాలు తలెత్తవనే సంంకేతాలు ఇస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
YS Jagan: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా..!?
విభజన సమస్యలపై హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. చిన్నచిన్న విషయాల్లో పేచీ లేకుండా ముందుకు సాగాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. సమావేశం జరిగిన మరుసటి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విభజన సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదనే చర్చ సాగింది. మరోవైపు ఎన్నికల వేళ లేనిపోని హడావుడి సృష్టించి.. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. ఈక్రమంలో పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే.. అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు
అభివృద్ధి మంత్రం..
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అంటూ చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఇవాళ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సమావేశంలోనూ అవే వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందని.. దానిని తరువాత వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కొనసాగించాయంటూ అభినందించారు. అదే సమయంలో గొడవలతో సమస్యలు పరిష్కారం కావని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు తనకు తెలుసని.. రాష్ట్ర విభజన తర్వాత ఎవరి కుంపటి వారిదేనని.. అభివృద్ధి కోసం ఐక్యమత్యంతో పనిచేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కళ్లు..
చంద్రబాబు వ్యాఖ్యల వెనుక..
చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై రాజకీయ పండితులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ప్రతి విషయానికి ఏపీతో వివాదానికి చూడొద్దని పరోక్షంగా చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దేనినైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలకు మంచిదని.. అలాకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దూకుడుగా వెళ్తే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్, చంద్రబాబు సమావేశాన్ని కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుండటంతో.. అలాంటి వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేందుకు చంద్రబాబు అలా అని ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగిన మరుసటి రోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్మలు మాత్రం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
TDP: టీడీపీ ఆఫీసులోకి దూరి సీనియర్ నేతపై కానిస్టేబుల్ దాడి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 07 , 2024 | 03:43 PM