ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu : 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు

ABN, Publish Date - Dec 13 , 2024 | 04:57 AM

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.

  • ఉద్యోగాల కల్పనకే ప్రథమ ప్రాధాన్యం

  • పరిశ్రమల అనుమతులపై అలసత్వం వద్దు

  • సానుకూల వాతావరణం కల్పించాలి

  • పారిశ్రామికాభివృద్ధిపై కలెక్టర్లకు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో సంబంధిత శాఖల అధికారులు జాప్యం చేయవద్దు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. భూ కేటాయింపులు, కాలుష్య-పర్యావరణ అనుమతులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రెండోరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ఆ వివరాలతో వచ్చే కలెక్టర్ల సమావేశానికి రావాలని, ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని చంద్రబాబు సూచించారు. జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ ఏడాదిలో ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం సరికాదన్నారు. కృష్ణా జిల్లాలో 5 సమావేశాలు నిర్వహించగా.. ఇతర జిల్లాల్లో అంతకన్నా తక్కువ నిర్వహించారన్నారు. ‘పశుసంవర్థక శాఖ, సీఆర్‌డీఏ, ఈడీబీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఉన్నత విద్య, హౌసింగ్‌, పెట్టుబడులు-మౌలిక సదుపాయాలు, ఐటీ-ఎలకా్ట్రనిక్స్‌, మున్సిపల్‌, మైనింగ్‌, నెడ్‌క్యాప్‌, రోడ్లు-భవనాలు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, టూరిజం తదితర శాఖల ద్వారా కొత్తగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి స్ట్రీమ్‌లైన్‌ చేస్తే ఉద్యోగాలు వస్తాయి. జిల్లాల్లో ఎన్ని పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే దానిపై ప్రత్యేక దృష్టి సారించి, అందుకనుగుణంగా పనిచేయాలి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


  • రైతుల భాగస్వామ్యంతో పరిశ్రమలు

‘‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో జిల్లాల్లో విరివిగా పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి. భూసేకరణలో రైతులను భాగస్వాములను చేయాలి. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని, మిగిలిన భూములు అమ్ముతామన్నా అభ్యంతరం లేదు. అమరావతి రాజధాని కోసం భూసేకరణ ఏవిధంగా చేశామో.. అదే విధంగా పీ4 మోడల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ చేయాలి. అంతిమంగా పరిశ్రమలకు భూములిచ్చిన రైతులకు లబ్ధి చేకూరాలి. ఉదాహరణకు నక్కపల్లి దగ్గర ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ రాబోతోంది. ఆ ప్రాంతం ఒక టౌన్‌షి్‌పగా అభివృద్ధి చెందుతుంది. త్వరలో రామాయపట్నంలో బీపీసీఎల్‌ ఆయిల్‌ రిఫైనరీ వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం భూములను త్యాగం చేసే రైతులకు అక్కడే ప్రయోజనం చేకూర్చాలి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎంఎ్‌సఎంఈలు ఉన్నాయి. వీటిలో కొన్ని బాగాలేవు. అందుకే ఎంఎ్‌సఎంఈలను సర్వే చేసి ఎన్యుమరేట్‌ చేయాలన్నాం. ఇది పూర్తయిన తర్వాత ప్రమాణాల ప్రకారం పరిశ్రమలను వర్గీకరణ చేస్తాం. ఒక తరహా పరిశ్రమలన్నింటినీ గ్రూపింగ్‌ చేసి వాటి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. ఒక పరిశ్రమలో తయారైన ఉత్పత్తులు మరో కంపెనీకి ముడిసరుకు అవుతుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ ఇంటిగ్రేషన్‌ చేసి, టెక్నాలజీని అందించి, మార్కెటింగ్‌పరంగా ప్రభుత్వపరంగా అవసరమైన సాయం అందిస్తాం’ అని సీఎం తెలిపారు.

  • నమ్మకం కలిగించాలి

‘పెద్ద ప్రాజెక్టులకు ఆరు నెలలు, ఒక సంవత్సరం పాటు అనుమతుల మంజూరు ఆలస్యమైతే కొన్ని సందర్భాల్లో అవి వెనక్కిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ, పాలనా యంత్రాంగం మొత్తం వేగం పుంజుకోవాలి. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావాలంటే భయపడేవారు. ‘ఇక చచ్చినా ఆంధ్రప్రదేశ్‌కు రాం’ అని కామెంట్లు చేసి మరీ వెళ్లిపోయారు. దాంతో మన రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం పోయింది. నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగమంతా సానుకూల దృక్పథంతో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారులు లెక్క చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ధోరణి మంచిది కాదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.


  • వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నా

‘నక్కపల్లి దగ్గర ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు ముడిసరుకు ఐరన్‌ ఓర్‌ ఎన్‌ఎండీసీ నుంచి రావాల్సి ఉంది. మిట్టల్‌ కంపెనీ వాళ్లు అడుగుతున్నది ఏమిటంటే.. వారికి పైప్‌లైన్‌ ఉంది కాబట్టి అక్కడ ఐరన్‌ ఓర్‌ ఇస్తే పైప్‌లైన్‌ ద్వారా స్లర్రీని నేరుగా ప్లాంట్‌కు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుందని, రవాణా వ్యయం తగ్గుతుందని అంటున్నారు. దానికోసం నేను ఇప్పటికి మూడుసార్లు కేంద్రమంత్రి కుమారస్వామికి ఫోన్‌ చేశాను. ఎన్‌ఎండీసీ చైర్మన్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడాను’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

  • ఇతర రాష్ట్రాలతో పోటీపడాలి: లోకేశ్‌

పెట్టుబడుల కోసం దేశంలోని అన్నిరాష్ట్రాలూ పోటీ పడుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా ఇతర రాష్ట్రాల కన్నా ముందుండాలని అధికారులకు సూచించారు. ఒక్క ఎంఎ్‌సఎంఈ సెక్టార్‌లోనే 80 శాతం ఉద్యోగాలు కల్పించవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు. రూ.5 కోట్లు, 10 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రతి పెట్టుబడిదారుడు మనకు చాలా ముఖ్యంగా భావించాలని సూచించా

  • పవర్‌ రిఫార్మ్స్‌ తెచ్చి పవర్‌ పోగొట్టుకున్నా: బాబు

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు తెచ్చానని, దానివల్ల తన అధికారాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఇంధనశాఖపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘1998 నాటికి విద్యుత్‌ రంగంలో సంస్కరణలు మొదలుకాలేదు. నా చొరవతోనే రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది. టెలికాం రెగ్యులేటరీ అప్పటికి రాలేదు. కానీ, నేను ఏపీలో విద్యుత్తు సంస్కరణలు తెచ్చారు. దానివల్ల 2004లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది’’ అని తెలిపారు.

Updated Date - Dec 13 , 2024 | 04:57 AM