ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:10 PM

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీల నేత సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.

AP CM Chandrababu Naidu Meeting With Central ministers Amit Shah and JP Nadda

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఎన్డీయే నేతల సమావేశానంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సైతం.. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో జరిగిన ఈ చర్చల్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లి.. చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారిలో చర్చించినట్లు సమాచారం.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు.. బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతోపాటు అమిత్ షా అధ్యక్షతన వహించారు. అలాగే ప్రతిపక్షాల ఆందోళనలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు తీరుతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో చర్చించిన అంశాలను టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విలేకర్ల సమావేశంలో వివరించిన సంగతి తెలిసిందే.


ఎన్డీయే భాగస్వామ్య సమావేశంలో పాల్గొనేందుకు టీడీప అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మంగళవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం అంటే.. డిసెంబర్ 25వ తేదీ భారత మాజీ ప్రధాని, భరతరత్న అటల్ బిహారి వాజపేయ్ జన్మదినం. అదీకాక ఆయన శత జయంతి జన్మదినం కావడంతో బీజేపీ ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్డీయే నేతల సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగింది.

Also Read: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 05:15 PM