CM YS Jagan: శింగనమల, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. ఇంచార్జీలుగా వీరాంజనేయులు, ఈర లక్కప్ప
ABN, Publish Date - Jan 19 , 2024 | 08:23 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని అధికార వైసీపీ భావిస్తుంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని అధికార వైసీపీ (YCP) భావిస్తోంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. శింగనమల నుంచి 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathi) విజయం సాధించారు. పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి వెనకుండి వ్యవహారాలు నడిపించేవారు. సాంబశివారెడ్డి అనుచరుడు వీరాంజనేయులు. శింగనమల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను వీరాంజనేయులుకు అప్పగించారు. దీంతో సాంబశివారెడ్డి వర్గం గుర్రుగా ఉంది. కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో ఇసుక దందాలో వీరాంజనేయులు కీలక వ్యక్తిగా ఉన్నారు.
మడకశిర ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి 2019లో తిప్పే స్వామి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పకు బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేక వర్గంలో ఈర లక్కప్ప ఉన్నారు. లక్కప్పను ఇంచార్జీగా నియమించడాన్ని తిప్పేస్వామి వర్గం జీర్ణించుకోలేక పోతుంది. జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చడంపై వైసీపీ ఎస్సీ సెల్ నేత చామలూరు రాజగోపాల్ స్పందించారు. సిట్టింగులను మార్చిన అంశంపై ఆలోచిస్తున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 19 , 2024 | 08:51 AM