AP Politics: ఏపీ సీఎం జగన్ ప్రాణాలకు థ్రెట్..? లీజుకు 2 హెలికాప్టర్లు.. నెలకు ఎంతంటే..?
ABN, Publish Date - Feb 22 , 2024 | 10:09 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఆయన వినియోగిస్తోన్న హెలికాప్టర్ మాత్రం పాతబడింది. అందుకోసం కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో రెండు హెలికాప్టర్లను లీజు తీసుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ప్రాణాలకు ముప్పు ఉందా..? మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల హిట్ లిస్ట్‌లో సీఎం జగన్ (Jagan) ఉన్నారా..? సీఎం జగన్ (Jagan) ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జగన్‌కు (Jagan) ప్రస్తుతం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు. జగన్ వినియోగిస్తోన్న హెలికాప్టర్ మాత్రం పాతబడింది. కొత్త హెలికాప్టర్లను ఉపయోగించాలని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. దాంతో రెండు హెలికాప్టర్లను లీజు తీసుకున్నారు.
సీఎం జగన్ భద్రత అంశాన్ని సున్నితంగా పరిశీలించాలని ఇంటెలిజెన్స్ డీజీ చెబుతున్నారు. సీఎం జగన్ ఉఫయోగిస్తున్న బెల్ హెలికాప్టర్ 2010 నుంచి వాడుతున్నారు. ఆ హెలికాప్టర్ వెంటనే మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫారసు మేరకు సీఎం జగన్ కోసం అత్యాధునిక రెండు బెల్ హెలికాప్టర్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు ఇంజన్లు కలిగిన బెల్ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ హెలికాప్టర్ల కోసం ప్రతి నెలా రూ.1.91 కోట్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇతర ఖర్చులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు మౌలికసదుపాయాలు, పెట్టుబడుల కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీచేశారు.
సీఎం జగన్ కోసం విజయవాడ, విశాఖపట్టణంలో ఆ రెండు హెలికాప్టర్లు ఉంటాయి. హెలికాప్టర్ లీజుతోపాటు ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీ, పైలట్లకు స్టార్ హోటళ్లలో బస, రవాణా, ఇంధనం, రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు, గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీల చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 22 , 2024 | 11:10 PM