AP Elections: సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ABN, Publish Date - Apr 08 , 2024 | 09:53 PM
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. సీపీఎం (CPM) పార్టీ కూడా ఈరోజు(సోమవారం) అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు సిద్ధమైంది. సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
అమరావతి: ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. సీపీఎం (CPM) పార్టీ కూడా ఈరోజు(సోమవారం) అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు సిద్ధమైంది. సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ (Congress) తో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఏపీ వ్యాప్తంగా అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ సీట్లలో సీపీఎం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై కాంగ్రెస్ - సీపీఎం మధ్య ఉమ్మడిగా అవగాహన కుదిరిందని తెలిపారు.
Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!
మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్‌లోగా ఒక అవగాహనకు రావాలని ఉభయ పార్టీలు అభిప్రాయపడ్డాయని చెప్పారు. సీపీఎం, సీపీఐ పార్టీలు పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో పరస్పరం బలపర్చుకోవాలని ఉమ్మడిగా అవగాహనకు వచ్చినట్లు చెప్పారు.అరకు పార్లమెంట్ నుంచి పాచిపెంట అప్పలనర్స(ST) కి టికెట్ కేటాయించినట్లు తెలిపారు.
అసెంబ్లీ స్థానాలివే..
1. రంపచోడవరం (ST) - లోతా రామారావు
2. అరకు (ST) - దీసరి గంగరాజు
3. కురుపాం (ST) - మండంగి రమణ
4. గాజువాక - మరడాన జగ్గునాయుడు
5. విజయవాడ సెంట్రల్ - చిగురుపాటి బాబురావు
6. గన్నవరం - కళ్ళం వెంకటేశ్వరరావు
7. మంగళగిరి - జొన్నా శివశంకర్
8. నెల్లూరు సిటీ - మూలం రమేష్
9. కర్నూలు - డి.గౌస్‌దేశాయి
10. సంతనూతలపాడు (SC) - ఉబ్బా ఆదిలక్ష్మి
Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 08 , 2024 | 09:53 PM