AP Govt : వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు
ABN, Publish Date - Dec 18 , 2024 | 04:47 AM
కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ ...
20న నూజివీడులో జాబ్‌మేళా: మంత్రి పార్థసారథి
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంగా వచ్చే ఎన్నిక ల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం మూలంగా పారిశ్రామిక రంగం కుదేలైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రోత్సాహక, పారదర్శక విధానాలతో గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, హెచ్‌పీ వంటి మెగా సంస్థలు ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఏపీ స్టేట్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ద్వారా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా, స్పిన్నింగ్ మిల్స్‌లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Updated Date - Dec 18 , 2024 | 04:47 AM