ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Good News: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు

ABN, Publish Date - Aug 13 , 2024 | 07:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఒకటా రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్‌లో ఉంటూ వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు. అయితే.. కూటమి సర్కార్ వచ్చిన రోజుల వ్యవధిలోనే..

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు (Telangana Govt Employees) చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఒకటా రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్‌లో ఉంటూ వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు. అయితే.. కూటమి సర్కార్ వచ్చిన రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియకు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పచ్చ జెండా ఊపేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి (తెలంగాణకు) పంపేలా మంగళవారం సాయంత్రం చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణా స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే విధుల్లో చేరతారని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.


శుభ సూచకం..

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల బదీలీలపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుముడి వీడిందని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి 122 మందిని తిరిగి తెలంగాణకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం శుభసూచకమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబుకు, సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు బొప్పరాజు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. ఉద్యోగులు సైతం ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచే ఉంది. అయితే.. ప్రభుత్వాలు మారినా.. వందల సార్లు వినతీపత్రాలు అందజేస్తున్నా శుభవార్త రాలేదు. ఎదురుచూపుల్లోనే ఉద్యోగులు ఉండిపోయారు. ఇటీవల.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశంలో ఉద్యోగుల సమస్య కూడా ప్రస్తావన వచ్చింది. ఈ ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ కీలక భేటీ జరిగిన రోజుల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 13 , 2024 | 11:02 PM

Advertising
Advertising
<