ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP High Court: మైనింగ్ శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN, Publish Date - Mar 20 , 2024 | 10:01 PM

బౌద్ధ క్షేత్రం సమీపంలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ అంత హడావుడిగా ఎందుకు అనుమతి ధర్మాసనం ప్రశ్నించింది. కొడవలి బౌద్ధ క్షేత్రం సమీపంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బౌద్ధ స్తూప పరిరక్షణ సమితి నేత రామేశ్వర రావు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ బుధవారం నాడు ధర్మాసనం విచారించింది.

అమరావతి: బౌద్ధ క్షేత్రం సమీపంలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడంపై హైకోర్టు ( High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ అంత హడావుడిగా ఎందుకు అనుమతి ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. కొడవలి బౌద్ధ క్షేత్రం సమీపంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ( High Court) బౌద్ధ స్తూప పరిరక్షణ సమితి నేత రామేశ్వర రావు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ బుధవారం నాడు ధర్మాసనం విచారించింది. సర్వే పూర్తి కాకుండా అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో గనుల శాఖ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రావెల్ మైనింగ్ నిలుపుదల చేస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 10:09 PM

Advertising
Advertising