Share News

AP High Court: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి: ఏపీ హైకోర్టు..

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:22 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్విచక్రవాహనం(Two-wheeler) నడిపే వారందరూ హెల్మెట్ (Helmet) ధరించడం తప్పనిసరంటూ ఏపీ హైకోర్టు(AP High Court) ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించని పక్షంలో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని తేల్చి చెప్పింది.

AP High Court: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి: ఏపీ హైకోర్టు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్విచక్రవాహనం(Two-wheeler) నడిపే వారందరూ హెల్మెట్(Helmet) ధరించడం తప్పనిసరంటూ ఏపీ హైకోర్టు(AP High Court) ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించని పక్షంలో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. హెల్మెట్ లేకపోవడం కూడా మరణాలకు కారణమంటూ హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేశ్ పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. బైక్ నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తనిఖీలు చేసే సమయంలో తప్పనిసరిగా బాడీ కెమెరా ధరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

Updated Date - Jun 26 , 2024 | 05:25 PM