AP Politics: రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారు.. కాంగ్రెస్‌పై మంత్రి అమర్‌నాథ్ నిప్పులు
ABN, Publish Date - Feb 18 , 2024 | 02:35 PM
కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరు ఇచ్చారని నిలదీశారు.
విశాఖపట్టణం: కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Amarnath) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్టు విభజించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. ఆ సమయంలో ఏపీ ప్రజల మనోభావాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని విరుచుకుపడ్డారు. దాంతో రాష్ట్రం విడిపోయిందని, ఏపీకి కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజల ఆదరణను కోల్పోయిందని వివరించారు. ఇప్పుడు మళ్లీ వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 6 వేలకు పైగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చామని తేల్చి చెప్పారు. ఏపీని విడదీసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రులు, వైసీపీ నేతల ఇళ్లను మట్టడించే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తీరును మంత్రి అమర్ నాథ్ తప్పు పట్టారు. ఆ పార్టీ నేతలు చిల్లర కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2024 | 02:35 PM