ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News : ఆయిల్‌ఫెడ్‌ను దోచేశారు

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:42 AM

ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో గత ఐదేళ్లు అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఆయిల్‌ఫెడ్‌కు చెందిన విలువైన భూములను సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు.

  • గత ఐదేళ్లు అవకతవకలతో సంస్థ నిర్వీర్యం

  • పీలేరులో సంస్థ భూమి కబ్జా

  • ‘అనంత’లో భూమి లీజుకు రెక్కలు

  • అనామక బ్యాంక్‌లో డిపాజిట్‌తో సొమ్ము గల్లంతు

  • 30 లక్షలు చెల్లించినా ఇంకా అందని వాహనం

  • నాటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన కీలక అధికారి

  • పెదవేగి కర్మాగారానికి కోట్లు వెచ్చించినా ఫలితం శూన్యం

  • రాష్ట్రంలో రైతులకు తెలంగాణ కన్నా తక్కువ ధర

  • రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విధానానికీ స్వస్తి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో గత ఐదేళ్లు అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఆయిల్‌ఫెడ్‌కు చెందిన విలువైన భూములను సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. ఆయిల్‌ఫెడ్‌ కీలక అధికారి వైసీపీ ప్రభుత్వ పెద్దలతో అంటకాగడం ద్వారా అన్ని వసతులున్న సంస్థ భూమిని అతి తక్కువ ధరకు లీజుకివ్వడం, విలువైన భూమిని వైసీపీ నేత అనుచరులు కబ్జా చేసినా చూస్తూ ఊరుకున్నారనే ఆరోపణలున్నాయి.

కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆ అధికారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి ఆయిల్‌ఫెడ్‌ను నిర్వీర్యం చేశారన్న విమర్శలున్నాయి. అనంతపురంలోని 22 ఎకరాల భూమిని అతి తక్కువ లీజుకు ఇచ్చి సంస్థ ఆదాయానికి గండికొట్టారు. అనంతపురంలో హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఆయిల్‌ఫెడ్‌ భూముల్లో కార్యాలయ భవనాలు, ఆరు గోదాములు ఉన్నాయి.

నాటి సీనియర్‌ మంత్రి ఈ భూమిని జగన్‌ బంధువులకు చెందిన ఎలక్ర్టికల్‌ కంపెనీకి తక్కువ ధరకు లీజుకు ఇప్పించారని చెప్తున్నారు. లీజుదారులు ఈ భూమిని సబ్‌లీజుకిచ్చి, ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో ఆయిల్‌ఫెడ్‌ కోసం సేకరించిన 64 ఎకరాల భూమిలో కొంత ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. అక్కడ 1989-94 మధ్య వేరుశనగ విత్తన, ఆయిల్‌ పరిశ్రమ పెట్టి, 1999లో మూసేశారు.


అందులో ఉన్న ఎకరం భూమిని గతేడాది అప్పటి ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారు. ఇక ఏలూరు జిల్లా పెదవేగిలోని ఆయిల్‌పామ్‌ కర్మాగారం మరమ్మతులకు గత ప్రభుత్వం దాదాపు రూ.10కోట్లు ఖర్చు చేసింది.

అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనుచరులతో ఏర్పడిన కమిటీ కర్మాగారాన్ని ఆధునికీకరిస్తున్నామంటూ కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. ఆ కర్మాగారంలో ముడి చమురు నిష్పత్తి తక్కువ వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్ర విభజనకు ముందు నుంచీ ఆయిల్‌పామ్‌ రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం బాగు చేశామని చెప్పినా.. తాజా పండ్లలో 16.5% మించి చమురు రావడం లేదు. అదే తెలంగాణలో 19.5% చమురు వస్తోందని రైతులు చెప్తున్నారు.


పాత కర్మాగారానికి కోట్లు వెచ్చించే కన్నా.. కొత్త మిషనరీని తెప్పించవచ్చని రైతులు మొత్తుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మన రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ధరకు పెదవేగి కర్మాగారంలో వచ్చే శాతాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నందున తెలంగాణ కన్నా రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ రైతులకు ఆశించిన ధర రావట్లేదు.

గతంలో వేరుశనగ విత్తనాలను సేకరించి, రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసిన ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ప్రస్తుతం అలాంటి పనులేమీ చేయడం లేదు. ఆయిల్‌ఫెడ్‌ మూలధనాన్ని అనామక బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడంతో 2022లో సొమ్ము గల్లంతైంది. రికవరీకి నెలల సమయం తీసుకున్నారు.

ఆయిల్‌ఫెడ్‌లో పని చేసే ఉద్యోగులకు 60ఏళ్లకే రిటైర్మెంట్‌ అని ప్రభుత్వం నిర్ధేశించగా, ఆ వయసు దాటినా 10 మంది కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్నారు. ఈ సంస్థ కోసం ఖరీదైన వాహనం కొనుగోలు చేయడానికి ఒక డీలర్‌కు రూ.30లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చినా.. వాహనం రాలేదని సమాచారం.

Updated Date - Aug 26 , 2024 | 04:42 AM

Advertising
Advertising
<