Atchannaidu: వైసీపీ రాక్షస జాతి పార్టీ..
ABN, Publish Date - Mar 19 , 2024 | 10:13 AM
Andhrapradesh: వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోతున్నా రన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయన్నారు. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అమరావతి, మార్చి 19: వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోతున్నా రన్న అక్కసుతో వైసీపీ (YSRCP) రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయన్నారు. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చిలకలూరిపేట ప్రజాగళం సభకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాడన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు గొడ్డలితో నరికి చంపారని మండిపడ్డారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని ఎద్దేవా చేశారు. మూలయ్య హత్య నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూలయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!
Lok Sabha Elections: గుజరాత్ కాంగ్రెస్‌కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 19 , 2024 | 10:13 AM