Balasouri: మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేసిన సీఎం జగన్
ABN, Publish Date - Apr 07 , 2024 | 10:22 PM
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌రెడ్డి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి(Balasouri) ప్రశ్నించారు. ఆదివారం నాడు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో జనగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
కృష్ణా: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌రెడ్డి (CM JAGAN) ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మచిలీపట్నం జనసేన (Janasena) ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి (Balasouri) ప్రశ్నించారు. ఆదివారం నాడు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో జనగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో టీడీపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి హాజరయ్యారు. వేల సంఖ్య లో అభిమానులు తరలి వచ్చారు.
పామర్రులో నాలుగు రోడ్లు జన సంద్రంతో కిక్కిరిశాయి. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని చెప్పారు. రాజధానిని అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. విశాఖపట్నంలో రూ. 500 కోట్ల ప్రజా ధనంతో జగన్ కోట కట్టారని విరుచుకుపడ్డారు.
YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో 70 శాతం పూర్తి చేశారని చెప్పారు. జగన్ వచ్చాక అంగుళం పనులు కూడా చేయలేదని అన్నారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి గెలుపుతో రాజధాని అమరావతి, పోలవరం పూర్తి అవుతాయని వల్లభనేని బాలశౌరి మాటిచ్చారు.
ఏపీని అన్ని విధాలా సీఎం జగన్‌రెడ్డి నాశనం చేశారని పామర్రు టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా అన్నారు. ఆదివారం నాడు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో జనగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి పాలనలో ధరలు పెంచి అన్ని వర్గాల వారిని వీధిన పడేశారని మండిపడ్డారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పథకాలకు అర్హులన్నారు.
జగన్ సీఎంగా అనర్హుడని పాలించే అర్హత లేదని విమర్శించారు. రైతుల నోట్లో మట్టి కొట్టి కన్నీరు పెట్టించారని మండిపడ్డారు. చెల్లెళ్లు నిలదీసి అడుగుతుంటే సమాధానం చెప్పలేక వాళ్లను బూతులు తిట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను జనం తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమితో ఒక రాక్షసుడిని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. పామర్రులో ఉన్న సమస్యలు మొత్తం డబుల్ ఇంజన్ సర్కార్‌తో పరిష్కారం చేస్తానని వర్ల కుమార్ రాజా హామీ ఇచ్చారు.
AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 07 , 2024 | 11:10 PM