TDP: బండారు సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత..
ABN, Publish Date - Mar 24 , 2024 | 03:06 PM
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆకస్మాతుగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతోపాటు బీపీ పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
విశాఖపట్నం, మార్చి 24: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆకస్మాతుగా షుగర్ లెవెల్స్ పడిపోవడంతోపాటు బీపీ పెరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకట్రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని బండారు భావించారు. కానీ కూటమిలో భాగంగా జనసేనకు టికెట్ పోయింది. పంచకర్ల రమేష్ బాబుకు ఈ సీటును కేటాయించారు. దీంతో సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య.. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ కూడా నడిచింది. వైసీపీలో చేరితే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.
మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 24 , 2024 | 03:45 PM