ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Attack On Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:12 PM

మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితులను పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులతో పాటు మరికొందరిని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు పోలీసులకు నిందితులు వివరించినట్లు సమాచారం.

CM Jagan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రాయి దాడి కేసులో నిందితులను పోలీసులు.. కాసేపట్లో విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులతో పాటు మరికొందరు అనుమానితులును పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు పోలీసులకు నిందితులు వివరించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడితో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి స్టేట్‌మెంట్ పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు ఇళ్ళకు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

AP Elections: వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..


అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రకటించడం కానీ.. మీడియా ముందుకు తీసుకురావడం కానీ జరగలేదు. ఏకంగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ అంశంలో ఊహాగానాలు తప్ప అసలు ఏం జరిగింది? ఏంటి? నిందితులను అరెస్ట్ చేశారా? లేదా? అనే విషయాలేమీ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీయే ఈ దాడికి తెగబడిందంటూ ఇష్టానుసారంగా మాటల దాడి చేశారు. ఒకవేళ టీడీపీ నేతలే ఈ దాడికి తెగబడి ఉంటే సీన్ మరోలా ఉండేది. ఇలా గుట్టు చప్పుడు కాకుండా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టి ఉండేవారు కాదు.

AP Elections: సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?


ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతుకుడు రాయి విసరడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఇది టీడీపీ చేయించిందంటూ వైసీపీ విమర్శలకు ఎక్కుపెట్టింది. ఈ ఘటన ఎన్నికల వేళ దురదృష్టకరమే. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమ బలాన్ని నమ్ముకోవడం లేదు. తాము నియమించుకున్న పోల్ స్ట్రాటజీ సంస్థలనే నమ్ముకుంటున్నాయి. అవి చెప్పినట్టు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టడమే ప్రధాన ధ్యేయం. తద్వారా వచ్చే సానుభూతితో రాజకీయ లబ్ది పొందాలి. రాజకీయ పార్టీలన్నీ ఇదే దారిలో పయనిస్తున్నాయనడానికి చాలా ఉదాహరణలున్నాయి. తొలుత అయితే జనం ఇలాంటి నీచ ఎత్తుగడలను పసిగట్ట లేదు కానీ పదే పదే అదే ప్రణాళికను అనుసరిస్తుంటే జనాలకు సీన్ అర్థమైపోయింది.

ఈ వార్తలు కూడా చదవండి..

నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 12:29 PM

Advertising
Advertising