AP Politics: త్వరలోనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తా.. ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 25 , 2024 | 03:48 PM
విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (MP GVL Narasimha Rao) అన్నారు. విశాఖ లోక్‌సభా టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని తెలిపారు.
విశాఖపట్నం: విశాఖ ఎంపీగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ జీవీఎల్ నరసింహరావు (MP GVL Narasimha Rao) గత కొంతకాలంగా అన్ని ప్రయత్నాలు చేశారు. విశాఖ సీటు కోసం కేంద్ర నేతలను కూడా కలిసి విన్నవించారు. అయితే బీజేపీ - తెలుగుదేశం - జనసేన పొత్తుల్లో భాగంగా విశాఖ సీటును తెలుగుదేశానికి కేటాయించినట్లు సమాచారం. రాజమండ్రి సీటును బీజేపీకి కేటాయించారు.
రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తు్న్నారు. అయితే ఈ విషయంపై ఎంపీ జీవీఎల్ ఓ వీడియో సందేశాన్ని సోమవారం నాడు విడుదల చేశారు. విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని అన్నారు. విశాఖ లోక్‌సభా టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని తెలిపారు.
మూడేళ్ల నుంచి విశాఖలోనే ఉంటూ... అన్ని సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కరించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని వివరించారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. ఇది వృథా అయిందని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాను సేవ చేయలేదన్నారు. ‘జీవీఎల్ ఫర్ వైజాగ్’ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది కొనసాగుతునే ఉంటుందని తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని....తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని అన్నారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుందామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
Budda venkanna: మంగళగిరిలో లోకేష్‌ను ఓడించటానికి రూ.500 కోట్లు దాచారు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 25 , 2024 | 05:09 PM