అవంతి ఓ ఊసరవెల్లి: బుద్దా వెంకన్న
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:43 AM
‘అవంతి శ్రీనివాస్... నీలాంటి ఊసరవెల్లులు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ(వన్‌టౌన్), డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘అవంతి శ్రీనివాస్... నీలాంటి ఊసరవెల్లులు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గురువారం అవంతిని ఉద్దేశించి ఆయన ఎక్స్‌లో స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం స్వాహా చేశారన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘ఆ దోపిడీలో జగన్‌రెడ్డీ, నువ్వూ భాగస్వాములే. నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు ద్రోహం చేశావు. రాజకీయ పునర్జన్మ ఇవ్వటమే కాకుండా గల్లీస్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లిన చంద్రబాబునూ అవమనించావు. నీ సానుభూతి కూటమికి అవసరం లేదు’ అని అన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 05:43 AM