Share News

AP Elections: ఏపీ ఎన్నికలపై సీఈఓ మీనా కీలక సూచనలు

ABN , Publish Date - Mar 15 , 2024 | 08:07 PM

ఏపీ ఎన్నికలపై ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక సూచనలు చేశారు. హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సీఈఓ మీనా మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేశారు.

AP Elections: ఏపీ ఎన్నికలపై సీఈఓ మీనా కీలక సూచనలు

అమరావతి: ఏపీ ఎన్నికలపై ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక సూచనలు చేశారు. హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సీఈఓ మీనా మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేశారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్థుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని చెప్పారు.

ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని సూచించారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యేకు రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉందని అన్నారు. అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 08:07 PM