AP Weather: అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:45 PM
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
అమరావతి, సెప్టెంబర్ 05: ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తోందని చెప్పారు.
దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు.
ఇదిలాఉంటే.. గడిచన 24 గంటల్లో అనకాపల్లిలోని చోడవరంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర తీరంలో రానున్న మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వేటకు వెళ్లినట్లయితే.. వెంటనే తిరిగి రావాలని సూచించారు.
Also Read:
విజయవాడ ముంపునకు కారకుడు జగన్ రెడ్డి..
జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!
చనిపోయిన ఇద్దరు కొడుకులను చెరో భూజాన వేసుకున్న
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 05 , 2024 | 03:45 PM