ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: నేడు సీఎం హోదాలో చంద్రబాబు.. సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణం..

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:30 AM

ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు. 151 సీట్లతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి పట్ట పగ్గాల్లేవ్ ఆ పార్టీ నేతలకు. ఫలితంగా జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది.

అమరావతి: ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు. 151 సీట్లతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి పట్ట పగ్గాల్లేవ్ ఆ పార్టీ నేతలకు. ఫలితంగా జగన్ (YS Jagan) ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి (NDA Alliance) భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది. ఇవాళ అసెంబ్లీలో సాధారణ సభ్యుడుగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదా లేకపోవడంతో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో వరసగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు సాధారణ సభ్యులు ప్రమాణం చేయనున్నారు.

AP Assembly Sessions Live Updates: తొలిరోజు సభ్యుల ప్రమాణం


పేరులో ఆంగ్లంలోని మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సాధారణ సభ్యుల ప్రమాణం ఉండనుంది. నేడు ఎవ్వరికీ పాస్ ఎంట్రీలు లేవు అని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేశాయి. సీటింగ్ లేని కారణంగా సభ్యుల కుటుంబ సభ్యులకు, సందర్శకులకు పాస్‌లు లేవు. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తానని 2021 నవంబర్ 19న సభలో చంద్రబాబు శపథం చేశారు. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో సభ నుంచి అవేదనతో చంద్రబాబు బయటకు వెళ్లిపోయారు. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అని.. తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ నాడు చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇవాళ సీఎం హోదాలో చంద్రబాబు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

Kodali Nani: కొడాలి నానికి బిగ్ షాక్..

Read more AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 10:36 AM

Advertising
Advertising