AP Elections: వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్
ABN, Publish Date - Apr 09 , 2024 | 03:09 PM
09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అయితే తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని... వారినే కొనసాగిస్తామని తెలిపారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Raghu Rama Krishna Raju: నాకెలాంటి భయం లేదు.. పవన్‌కల్యాణ్‌ను హామీ ఇచ్చారు..
అయితే ఎన్నికల వేళ.. లబ్దిదారులకు పెన్షన్ పంపిణి కార్యక్రమానికి వలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో లబ్దిదారులకు ఏ మాత్రం ఆలస్యం కాకుండా.. పెన్షన్ అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!
అందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ఎన్నికల సీఈవో మీనాకు బాబు లేఖ సైతం రాశారు. కానీ పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లిన పలువురు లబ్దిదారులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ మరణాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కారణంగానే జరిగాయంటూ.. అధికార వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
Ugadi 2024: మళ్లీ మంచి రోజులు వస్తాయి.. చంద్రబాబు కీలక కామెంట్స్..
పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారంటూ.. అధికార జగన్ పార్టీ ఓ ప్రచారానికి తెర తీసింది. మరోవైపు ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు వాలంటీర్లు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అలాంటి వేళ వాలంటీర్ల జీతం పెంచుతానని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు రూ. 5 వేలు జీతం అందుతోన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..
Updated Date - Apr 09 , 2024 | 03:59 PM