ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: నాడు చంద్రబాబు ఫోన్ ఎత్తలేదు.. నేడు ఊహించని ఝలక్!

ABN, Publish Date - Jun 20 , 2024 | 10:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీలు షురూ అయ్యాయి. ఇప్పటికే డీజీపీని నియమించిన ప్రభుత్వం.. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు వరకూ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీలు షురూ అయ్యాయి. ఇప్పటికే డీజీపీని నియమించిన ప్రభుత్వం.. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు వరకూ డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్‌ను ప్రింటింగ్‌ అండ్ స్టేషనరీ కమిషనర్‌‌గా బదిలీ చేయడం జరిగింది. ఇక ఏసీబీ డీజీగా అతుల్ సింగ్‌‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అగ్నిమాపక శాఖ డీజీగా శంకబ్రత బగ్చిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని పీవీ సునీల్‌కుమార్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని రిషాంత్‌రెడ్డికి ఆదేశం వెళ్లింది. అయితే.. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి రిషాంత్‌రెడ్డి రిలీవ్‌ అయ్యారు.


రాజేంద్రనాథ్ ఇకపై..!

వైసీపీతో అంటకాగిన పోలీస్ అధికారులకు టీడీపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా.. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేయడంతో ఇది ఊహించని దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో టీడీపీ నేతలకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆఖరికి నాడు చంద్రబాబు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదు. దీంతో ఇప్పుడు ఆయన్ను ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా నియమించడం జరిగింది.


నాడు అలా.. నేడు ఇలా..!

ఇక పీవీ సునీల్ గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. సీఐడీ డీజీగా సునీల్ ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. అంతేకాదు.. ఇదేమిటని ప్రశ్నిస్తే టీడీపీ కార్యకర్తలు, నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే.. ఈయన్ను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేసింది సర్కార్. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐటీడీపీ కార్యకర్తలను సీఐడీ టీమ్ ఎంతలా వేధించినదో చెప్పాల్సిన పనిలేదు.


సీన్ కట్ చేస్తే..?

ఇంటెలిజెన్స్, రెడ్‌సాండల్‌ ఎస్పీగా ఉన్న రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. చిత్తూరు జిల్లా అంగళ్లులో చంద్రబాబుపై వైసీపీ నేతలు రాళ్ల దాడి వేస్తే నామమాత్రపు కేసు నమోదు చేసినది రిషాంత్‌రెడ్డే కావడం గమనార్హం. ఆఖరికి చంద్రబాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదుచేసిన పరిస్థితి. ఈ ఘటనలో వైసీపీ నేతలను వెనుకేసుకొచ్చి మీడియా ముందు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన పరిస్థితి. అప్పటినుంచి టీడీపీ నేతలపై పలు కేసులు పెట్టిన రిషాంత్‌రెడ్డి టీం నానా ఇబ్బందులు పెట్టింది. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారడం.. ఇలా జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

Updated Date - Jun 20 , 2024 | 11:01 PM

Advertising
Advertising