Chandrababu Naidu: వైసీపీ రౌడీలను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం
ABN, Publish Date - May 16 , 2024 | 08:06 PM
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి, టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారని తెలిపారు. ఆ క్రమంలో ఆడవాళ్లు అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
వైసీపీ రౌడీలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి అలాంటి గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదన్నారు.
అంతేకాదు విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత పోలీసుల(police) అదుపులో నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరి ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని కోరారు. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా... వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: జగన్ ఔట్, చంద్రబాబు ఇన్..తప్పు చేస్తే వదిలేది లేదు
TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్
Read Latest AP News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 08:36 PM