ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

ABN, Publish Date - Nov 24 , 2024 | 06:09 PM

విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.

ఒంగోలు, నవంబర్ 24: జగన్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో నాటి జగన్ కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం ఒంగోలు‌లో స్పందిస్తూ.. మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరన్నారు.

Also Read: మహారాష్ట్రలో రేపే సీఎం, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం..!


బాలినేని వ్యాఖ్యలు చూస్తుంటే.. అబద్దాలు కూడా ఆయన ఇంత గొప్పగా చెప్పగలరా? అనిపిస్తుందని చెవిరెడ్డి ఈ సందర్బంగా వ్యంగ్యంగా అన్నారు. పార్టీ నేతల మెప్పు పొందడానికి బాలినేని ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను విమర్శిస్తే.. పార్టీలో మెచ్చుకుంటారనే భావనలో బాలినేని ఉండి ఉండ వచ్చునన్నారు. అందుకే ఇలా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదని తెలిపారు.

Also Read: జార్ఖండ్ గవర్నర్‌తో సీఎం హేమంత్ సోరెన్ భేటీ..!


ఇప్పటికే ఎమ్మెల్సీ సీటు కోసం బాలినేని.. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని అంతా అనుకుంటున్నారన్నారు. మీరు మంత్రిగా ఉన్నపుడు మంచి జరిగితే అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని బాలినేనికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సూచించారు. సెకి నుంచి లేఖ వచ్చినప్పుడు మీరు సంతకం పెట్టిన విషయం మర్చిపోయారా?.. అంటూ బాలినేనిని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. నాడు ఒప్పందాలపై రెండు సార్లు సంతకాలు పెట్టి.. ప్రస్తుతం అర్థరాత్రి తనను సంతకం పెట్టామన్నారు అని చెప్పటం బాధాకరమని అభివర్ణించారు.

Also Read:ఎన్‌సీసీ వారోత్సవాలు.. కరీంనగర్‌లో కేడెట్ల సేవా కార్యక్రమం


అయితే కేబినెట్‌లోని కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని గుర్తు చేశారు. అవి కేబినెట్‌లోని మంత్రుల ఆమోదంతో తీర్మానాలు అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయినా.. ఏ కుటుంబం అయితే రాజకీయంగా ఈ స్థితికి తీసుకు వచ్చిందో.. వారిపైనే విమర్శలు చేస్తున్నారన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో మంత్రిగా తనకు స్వేచ్ఛ లేదని చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలో.. చార్టెడ్ ఫ్లైట్‌లో ఇతర పార్టీల నేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఉందన్నారు. ఇది వాస్తవం కాదా? అంటూ ఈ సందర్భంగా బాలినేనిని చెవిరెడ్డి సూటిగా నిలదీశారు.


వైఎస్ జగన్‌ మీద అభాండాలు వేసి వ్యక్తిత్వ హననం చేసి లబ్ధి పొందాలనుకుంటే.. అది మీకే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని.. ఈ విషయాన్ని గుర్తుంచు కోవాలని బాలినేనికి ఈ సందర్బంగా చెవిరెడ్డి హితవు పలికారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవటానికి చేయాల్సిన దుర్మార్గాలు అన్నీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదీకాక.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యూనిట్ కరెంట్ ధర రూ. 4.50తో ఒప్పందం చేసుకుంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో.. రూ. 2.48లకే చేసుకున్నారని చెవిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.


విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలపై చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై విధంగా స్పందించారు.

For AndhraPradesh news And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 06:09 PM