ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: జగన్‌కు ఝలక్.. గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే..

ABN, Publish Date - Mar 06 , 2024 | 06:29 PM

AP Politics: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) వరుస షాక్‌లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే(Chittoor MLA) అరని శ్రీనివాసులు(Arani Srinivasulu) పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. చిత్తూరుని అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ తనకు..

Chittoor MLA Arani Sreenivasulu

చిత్తూరు, మార్చి 06: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) వరుస షాక్‌లు ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే(Chittoor MLA) అరని శ్రీనివాసులు(Arani Srinivasulu) పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. చిత్తూరుని అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ తనకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించలేని దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

ఒక కార్పోరేటర్ స్థానం కూడా తమ సామాజికవర్గానికి ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరించి.. వైసీపీ కోసం అంకిత భావంతో పనిచేశానని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తానని ఇవ్వలేదన్నారు. రాజ్యసభ ఇస్తానని మాట తప్పాడని.. ఆఖరికి ఏపీఐసీసీ చైర్మన్ పదవి ఆశ చూపి నిరాశకు గురిచేశారని జగన్‌పై ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆరోపించారు శ్రీనివాసులు. రూ 74 కోట్లు బిల్లులు బాకాయిలు పెట్టారన్నారు.

జనసేనలోకి శ్రీనివాసులు..

చిరంజీవి కుటుంబంతో తనకు 2002 నుండి అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఆరని శ్రీనివాసులు తెలిపారు. పవన్ కల్యాన్‌ని కలిశానని.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బలిజలు అంటే జగన్‌కు ద్వేషం అని శ్రీనివాసులు ఆరోపించారు. వైసీపీలో ఇమడలేక జనసేన పార్టీలో చేరుతున్నట్లు శ్రీనివాసులు ప్రకటించారు. గురువారం నాడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్నట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 06:29 PM

Advertising
Advertising