ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్.. మీడియాకు ప్రత్యేకంగా చూపించిన పవన్

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:13 PM

Andhrapradesh: తన ఇద్దరు కుతూరులతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పవన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు.

Deputy CM Pawan Kalyan

తిరుమల, అక్టోబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్... దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు. నిన్న కాలిబాటన తిరుమలకు వచ్చిన ఉపముఖ్యమంత్రి ఈరోజు (బుధవారం) ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు.

Governor: హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..


స్వామి పాదాల వద్ద డిక్లరేషన్ బుక్

దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు పవన్. ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం వెలుపల మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో బుక్‌ను రూపొందించినట్లు సమాచారం. రేపటి (గురువారం) వారాహి సభలో పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నారు. దర్శనం తర్వాత అన్నదానం కేంద్రం వద్దకు చేరుకున్నారు. అన్నప్రసాదంలో అన్నప్రసాదాన్ని పవన్ స్వీకరించారు. అన్నదానంలో తనిఖీలు ముగించి అక్కడి నుంచి గాయత్రి నిలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు.

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు


తొలిసారి మీడియా ముందుకు చిన్న కుమార్తె

కాగా.. ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద్ద కూతురు ఆధ్య, కుమారుడు అఖిరా నంద‌న్ తరచూ మీడియా ముందుకు రావడంతో వారిద్దరూ అందరికీ సుపరిచితమే. అయితే పవన్ తన చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలను మాత్రం తొలిసారి మీడియా ముందుకు తీసుకొచ్చారు పవన్. ఈ సందర్భంగా పలీనా అంజని తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. పలీనాతో డిక్లరేషన్ పత్రాలపై పవన్ సంతకాలు చేయించారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.


మీడియాపై ఆంక్షలు..

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో మీడియాపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఆలయం వద్ద గొల్లమండపంకే మీడియాను పరిమితం చేసింది టీటీడీ. పవన్ కళ్యాణ్ ఆలయం వెలుపలకి వచ్చిన సమయంలోనూ మీడియాను బయటకు రాకుండా టీటీడీ అధికారులు అడ్డుకున్నారు. అటు అన్నదాన సముదాయంలోకి మీడియాకు నో ఏంట్రీ విధించారు. ఈ క్రమంలో టీటీడీ, భద్రతా సిబ్బంది తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు...

Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..


విశ్రాంతి తీసుకుంటూ మెట్ల మార్గంలో..

కాగా.. ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు నిన్న మధ్యాహ్నమే పవన్ తిరుమలకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నడకమార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలనుకున్న ఆయన.. ఎయిర్‌పోర్టు నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో... సాయంత్రం 4.50 ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ఠ భద్రత మధ్య పవన్‌ కళ్యాణ్‌ నడక మొదలుపెట్టారు.


రెండు మోకాళ్లకు బెల్ట్‌లు (నీ క్యాప్‌) ధరించారు. అయినప్పటికీ మెట్లు ఎక్కేక్రమంలో పవన్‌లో అలసట కనిపించింది. మధ్యమధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు. అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒకదశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బందీ అప్రమత్తం అయ్యారు. అయితే, ఏడో మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండు వరకు నడిచారు. అప్పటికే అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండు నుంచి వాహనంలో గాయత్రి సదన్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.


జనసేన నేతల దీక్షలు..

ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ అపవిత్రంపై జనసేన నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో పవన్‌కు మద్దతుగా జిల్లా జనసేన నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. దాదాపు 111 మంది 9 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలు చేయనున్నారు. దీక్ష విరమణ సందర్భంగా గుంటూరు నుంచి నంబూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. నంబూరు దశవతారం గుడిలో జనసేన నేతలు దీక్షలు విరమించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: రోడ్డు పక్కన ఎలుగుబంటి.. కారులో వెళ్తున్న వారికి ఎలాంటి షాకిచ్చిందో చూడండి.. వీడియో వైరల్..

YS Sharmila: లడ్డూ వివాదానికి మతం రంగు పూయడం సరికాదు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 01:26 PM