TTD: ఫిబ్రవరిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎంతంటే?
ABN, Publish Date - Mar 02 , 2024 | 10:30 AM
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వారాంతంలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో వేసి మొక్కలు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ శనివారం వెల్లడించింది.
తిరుమల, మార్చి 2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Srivari Temple) దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివస్తుంటారు. వారాంతంలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో వేసి మొక్కలు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ (TTD) శనివారం వెల్లడించింది. ఫిబ్రవరి మాసంలో శ్రీవారిని 19లక్షల 06వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ.111.71 కోట్ల ఆదాయం వచ్చింది. 95లక్షల 43 వేల లడ్డులను భక్తులకు టీటీడీ విక్రయించింది. అటు 43 లక్షల 61వేల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Lokesh: మంచినీళ్లు అడిగితే చంపేస్తారా?...వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్
Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ పోటీ..? వైసీపీలో గుబులు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 02 , 2024 | 10:42 AM