Bhumana Karunakar Reddy Video: టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ABN, Publish Date - Sep 23 , 2024 | 05:10 PM
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... కొద్ది రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని.. తాను ఏ తప్పు చేయలేదని... ఏ పరీక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి చెప్పారు.
ALSO READ: Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..
తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు. లడ్డూలు కలంకితమైందని.. కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..
AP News: మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్
YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 23 , 2024 | 06:15 PM