Bhatti Vikramarka: మోహన్ బాబుపై మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు
ABN, Publish Date - Aug 11 , 2024 | 03:06 PM
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్‌లర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.
తిరుపతి: పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్‌లర్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రశంసలు కురిపించారు. చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ముఖ్య అతిథిగా మల్లు భట్టి విక్రమార్క , మంచు మోహన్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయినవారు స్థాయి, హోదా పది మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు. ‘‘మనం బతుకుతూ పదిమందిని బతికించడం గొప్ప విషయం. పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్బుత విజయాలు సాధించాలి. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మర్చిపోకూడదు’’ అని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థలో అలా అడుగుపెట్టా: మోహన్ బాబు
తల్లి - తండ్రి -దైవం వీరిని గుర్తుంచుకోకపోతే పుట్టగతులు ఉండవని ఎంబీయూ ఛాన్స్‌లర్ మంచు మోహన్ బాబు తెలిపారు. విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారితప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32సంవత్సరాల క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టానని వివరించారు. అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి మల్లు భట్టి విక్రమార్కఅని మెచ్చుకున్నారు. దివంగత మాజీ ముఖ్యంత్రులు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టుతో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క అని మంచు మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.
Updated Date - Aug 11 , 2024 | 03:33 PM