AP Politics: వలంటీర్లే వైసీపీ నేతలు.. తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ..
ABN, Publish Date - Apr 07 , 2024 | 09:48 AM
Andhra Pradesh: వలంటీర్ల వ్యవస్థను వైసీపీ(YCP) తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి(Election Commission) కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికార వైసీపీ నేతల తీరు మారడం లేదు.. వైసీపీ కోసం పని చేస్తున్న వలంటీర్లలోనూ(Volunteers) మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) కుండబద్దలుకొట్టి చెప్పారు.
Andhra Pradesh: వలంటీర్ల వ్యవస్థను వైసీపీ(YCP) తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి(Election Commission) కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికార వైసీపీ నేతల తీరు మారడం లేదు.. వైసీపీ కోసం పని చేస్తున్న వలంటీర్లలోనూ(Volunteers) మార్పు రావడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) కుండబద్దలుకొట్టి చెప్పారు. వలంటీర్లే వైసీపీ నేతలు స్పష్టం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.. వలంటీర్లే ఇక వైసీపీ నాయకులు అని అన్నారు. వారే జగన్‌ను గెలిపించుకుంటారని కామెంట్స్ చేశారు. కుప్పం మండలంలోని 354 మంది వలంటీర్లలో 326 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భరత్.. వలంటీర్లే వైసీపీకి అండగా ఉంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో భరత్ తెర తొలగించి.. నిజం చెప్పేశారని అంటున్నారు విపక్ష నేతలు. భరత్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 07 , 2024 | 09:48 AM